Nagole: నాగోల్‌లో TSK బార్ అండ్ గ్రిల్ ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్
Nagole: తెలంగాణ పల్లె రుచులను పరిచయం చేసేలా నాగోల్‌లో TSK బార్ అండ్ గ్రిల్ ప్రారంభం; పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు.
Nagole: నాగోల్‌లో TSK బార్ అండ్ గ్రిల్ ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్
నాగోల్: తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయ రుచులను నగర ప్రజలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నాగోల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్పైస్ కిచెన్ (TSK) బార్ అండ్ గ్రిల్ నూతన శాఖ ఘనంగా ప్రారంభమైంది.
తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
తెలంగాణ సంస్కృతి, గ్రామీణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా రూపుదిద్దారు. అసలైన తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు రుచికరమైన మాంసాహార, శాకాహార వంటకాలను వినియోగదారులకు అందించనున్నారు.
ఈ సందర్భంగా అతిథులు రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ వంటకాల ప్రత్యేకతను నగర ప్రజలకు మరింత చేరువ చేస్తూ TSK రెస్టారెంట్ మంచి ఆదరణ పొందాలని, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.




