Nalgonda: సైబర్ నేరాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష ఎస్పీ శరత్ చంద్ర పవార్!

Nalgonda: నల్లగొండలో సైబర్ జాగృతి దివస్. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు, డిజిటల్ అరెస్టు బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచన.

Saleem, Nalgonda
Published on: 5 Aug 2026 4:44 PM IST
Nalgonda
X

Nalgonda: సైబర్ నేరాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష ఎస్పీ శరత్ చంద్ర పవార్!

నల్గొండ: "సురక్షా కా తిరంగా – స్టే అలర్ట్, సైబర్ సేఫ్" పిలుపుతో సైబర్ మోసాలపై ప్రజలు విస్తృత అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సూచించారు. బుధవారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 'సైబర్ జాగృతి దివస్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాధారణ దొంగతనాల కంటే సైబర్ మోసాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ నెలలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని, అధిక లాభాల పేరుతో వచ్చే నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, లోన్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు వీడియో కాల్స్‌ ద్వారా అరెస్ట్‌లు చేయరని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story