Nanakramguda: నానక్‌రామ్‌గూడలో 30వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!
Nanakramguda: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో 30వ అంతస్తు నుంచి దూకి సూర్యాపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భరత్ ఆత్మహత్య చేసుకున్నారు.
Nanakramguda: నానక్‌రామ్‌గూడలో 30వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!
నానక్‌రామ్‌గూడ: నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వుప్పల భరత్ (29) 30వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్ గత రెండు రోజుల క్రితమే నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగారు. ఆయన బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం అపార్ట్‌మెంట్ 30వ అంతస్తు నుండి కిందకు దూకడంతో, అక్కడ పార్కింగ్ చేసి ఉన్న హ్యుందాయ్ వాహనంపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు వెంటనే స్పందించి, తీవ్ర గాయాలతో ఉన్న భరత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక స్టార్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. మృతుడి బంధువు వుప్పల కిషోర్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.




