Tarnaka: తార్నాక నారాయణ స్కూల్‌లో ఘనంగా ప్రీమియర్ లీగ్ ఆటల పోటీలు!
Tarnaka: తార్నాకలోని నారాయణ స్కూల్‌లో విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు.
Tarnaka: తార్నాక నారాయణ స్కూల్‌లో ఘనంగా ప్రీమియర్ లీగ్ ఆటల పోటీలు!
Tarnaka: విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను పెంపొందించాలనే ఉద్దేశంతో నారాయణ సివో స్కూల్ తార్నాక విజయ డైరీ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వరరావు పాల్గొని ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమని, క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, ఏఓ వెంకటేష్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




