Hayathnagar: రావి నారాయణరెడ్డి కాలనీలో ఆడపిల్లలకు ఉచితంగా బట్టల పంపిణీ
Hayathnagar: హయత్‌నగర్ రావి నారాయణరెడ్డి కాలనీలో నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత బట్టల పంపిణీ. పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి.
Hayathnagar: రావి నారాయణరెడ్డి కాలనీలో ఆడపిల్లలకు ఉచితంగా బట్టల పంపిణీ
Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్–3 భూ పోరాట కేంద్రంలో నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆడపిల్లలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి పాల్గొని ఆడపిల్లలకు బట్టలను పంపిణీ చేశారు. నారాయణ సేవా సంస్థ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు బట్టలు అందజేశారు.
ఈ సందర్భంగా సేవా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, చిన్నారులకు తమ వంతు సహాయం అందించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ సెక్షన్ లీడర్లు వీరేష్, అలివేల తాతలు తదితరులు పాల్గొన్నారు.
Next Story




