Hyderabad: నారాయణగూడ భట్టాడ్ కి ఇడ్లీ రెస్టారెంట్‌లో అదనపు బిల్లు రగడ!
Hyderabad: హైదరాబాద్ నారాయణగూడ భట్టాడ్ కి ఇడ్లీ రెస్టారెంట్‌లో కస్టమర్, యాజమాన్యం మధ్య గొడవ. అదనపు బిల్లుపై పరస్పర దాడులు, పోలీసులకు ఫిర్యాదు.
Hyderabad: నారాయణగూడ భట్టాడ్ కి ఇడ్లీ రెస్టారెంట్‌లో అదనపు బిల్లు రగడ!
Hyderabad: హైదరాబాద్ నారాయణగూడలో ఓ రెస్టారెంట్ లో కస్టమర్, యజమానికి మధ్య గొడవ జరిగింది. అదనంగా బిల్లు వేసారనే ఆరోపణలతో... భట్టాడ్ కి ఇడ్లీ రెస్టారెంట్ యజమనికి, కష్టమర్స్ ఇరు వర్గాలు మధ్య వాగ్వివాదం జరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. హిమాయత్ నగర్ లోని స్ట్రీట్ నెం 12లో నివాసం ఉండే ఆశీష్ 30మంది కుటుంబ సభ్యులతో కలిసి నారాయణగూడ లోని భట్టాడ్ కి ఇడ్లీ రెస్టారెంట్ కు వచ్చారు.
నాలుగు గంటలు అయినా వెళ్లిపోకుండా రెస్టారెంట్ లో టేబుల్స్ బ్లాక్ చేసి. ఇతర కస్టమర్లు రాకుండా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని దీంతో వారిని మందలించడంతో అదనంగా డబ్బులు చెల్లిస్తామని సదరు కస్టమర్ చెప్పాడని యజమాని యోగేష్ భట్టాడ్ తెలిపారు.
అనంతరం వారు వెళ్ళిపోయేటప్పుడు అదనంగా 3వేలు బిల్లు వేసి ఇవ్వడంతో తమపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడ్డారని చెప్పారు. దీంతో ఆత్మరక్షణ కోసం తాము కూడా దాడులు చేయాల్సి వచ్చిందని యజమాని తెలిపారు.
ఓ వైపు తమపై అకారణంగా దాడి చేయడంతో పాటు అనుచితంగా ప్రవర్తించినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కస్టమర్ ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. అనంతరం తాము కూడా కస్టమర్స్ పై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకున్న నారాయణగూడ పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.




