Hayathnagar: నార్ముల్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2.. బీఆర్ఎస్కు 1 స్థానం!
Hayathnagar: నార్ముల్ మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం హయత్‌నగర్‌లో కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల తోపులాట, ఉద్రిక్తతను అదుపుచేసిన పోలీసులు.
Hayathnagar: నార్ముల్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2.. బీఆర్ఎస్కు 1 స్థానం!
హయత్‌నగర్: నార్ముల్ మదర్ డెయిరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు రెండు స్థానాల్లో విజయం సాధించగా, ఒక స్థానాన్ని బీఆర్ఎస్ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. సోమవారం హయత్‌నగర్‌లోని ఎస్.వి. కన్వెన్షన్‌లో జరిగిన ఎన్నికల్లో రెండు జనరల్ స్థానాలకు పెద్ది రెడ్డి భాస్కర్‌రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, మహిళా జనరల్ స్థానానికి చీర లావణ్య విజయం సాధించారు.
అధికార పక్షం మద్దతుతో ఆలస్యంగా బరిలోకి దిగిన గూడూరు శ్రీధర్‌రెడ్డి ఓటమి పాలవడం గమనార్హం. రూ.70 కోట్ల నష్టంతో మూసివేత దిశగా పయనిస్తున్న నార్ముల్ మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంతో చొరవ చూపారని చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఎన్డీడీబీకి ఎన్ఓసీ ఇప్పించారని పేర్కొన్నారు. దీంతో ఎన్డీడీబీ నార్ముల్ డెయిరీతో ఒప్పందం చేసుకోవడంతో రైతులకు పాల బిల్లులు చెల్లించడం సాధ్యమైందన్నారు.
అయితే చైర్మన్ ప్రసంగిస్తున్న సమయంలో మాజీ చైర్మన్ శ్రీకర్‌రెడ్డి వర్గీయులు అడ్డుకుంటూ ఆలేరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాలు తోపులాటకు దిగడంతో పాటు మైకులు ధ్వంసమైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్ అభ్యర్థులను చైర్మన్‌తో పాటు ఇరుపార్టీల నాయకులు అభినందించి సన్మానించారు.




