Shamshabad: అంజయ్య నగర్ ఘటనతో నార్సింగి మున్సిపల్ అధికారుల అలర్ట్!

Shamshabad: అంజయ్య నగర్ ఘటనతో అప్రమత్తమైన నార్సింగి మున్సిపల్ అధికారులు ఆల్కాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత స్పెషల్ డ్రైవ్.

ANJAIAH, SHAMSHABAD
Published on: 1 Sept 2026 6:58 PM IST
Shamshabad
X

Shamshabad: అంజయ్య నగర్ ఘటనతో నార్సింగి మున్సిపల్ అధికారుల అలర్ట్!

Shamshabad: అంజయ్య నగర్‌లో జరిగిన ఘటనతో గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నార్సింగి మున్సిపల్ పరిధిలోని ఆల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అధికారులు చర్యలు చేపట్టారు.

ఒకలా అనుమతులు తీసుకుని మరోలా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు, అనుమతి లేకుండా నిర్మించిన అదనపు స్లాబ్‌లను జేసీబీలతో తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంజయ్య నగర్ ఘటన తర్వాత.. ఆల్కాపూర్‌లో మున్సిపల్ అధికారుల హడావిడి కొనసాగుతోంది.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD