Narsingi: బైక్ చక్రంలో చీర కొంగు చిక్కుకొని ఘోర ప్రమాదం.. మహిళ మృతి!

Narsingi: రాజేంద్రనగర్ సబ్ డివిజన్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ANJAIAH, SHAMSHABAD
Published on: 16 May 2026 12:44 PM IST
Narsingi
X

Narsingi: బైక్ చక్రంలో చీర కొంగు చిక్కుకొని ఘోర ప్రమాదం.. మహిళ మృతి!

నార్సింగి: చీర కొంగు బైక్ చక్రంలో చిక్కుకొని కిందపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. షేక్పేట్ ఓయూ కాలనీ కి చెందిన బానోత్ సంతోషి , తన తల్లి బానోత్ ధర్మిని(56)తో కలిసి ద్విచక్ర వాహనం(టీజి 24ఏ 0502)పై ఖానాపూర్లోని కీర్తి మసాలా హోటల్ కు వెళ్లి తిరిగి వస్తున్నారు.

వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఖానాపూర్ చెక్పోస్ట్ సమీపానికి చేరుకోగానే ధర్మిని ధరించిన చీర కొంగు బైక్ వెనుక చక్రానికి చుట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊగల్ బాలాజ్ తాండాగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story