Banjara Hills: చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి : అనుకృతి శర్మ
Banjara Hills: బంజారాహిల్స్‌లో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన-2026ను ప్రారంభించిన సెలబ్రిటీ హోస్ట్ అనుకృతి శర్మ.
Banjara Hills: చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి : అనుకృతి శర్మ
Banjara Hills: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన - 2026 ను సెలబ్రిటీ లైవ్ హోస్ట్ అనుకృతి శర్మ ఆదివారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలు లో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు. చేనేత ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదని, నేటి తరం యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని అనుకృతి శర్మ అన్నారు.
నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 14వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 74 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు.




