Hyderabad: హైదరాబాద్‌లో ఈ నెల 20న జాతీయ ఓబీసీ సదస్సు!
Hyderabad: బీజేపీ హఠావో.. బీసీ రిజర్వేషన్ బచావో నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్.
Hyderabad: హైదరాబాద్‌లో ఈ నెల 20న జాతీయ ఓబీసీ సదస్సు!
Hyderabad: ‘బీజేపీ హఠావో.. బీసీ రిజర్వేషన్ బచావో’ నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీలంతా కాక్రోజ్ పార్టీ తరహాలో ఐక్యంగా ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 20న హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ సదస్సు పోస్టర్‌ను సైఫాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు.
జనగణనలో ఓబీసీ కులాల లెక్కలు తీస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని ఆరోపించారు. జాతీయ సదస్సు ద్వారా జనగణనలో ఓబీసీ కులాల వివరాలను చేర్చాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందినప్పటికీ ఆ వర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
బీజేపీ విధానాల్లోనే బీసీ వ్యతిరేకత ఉందని, బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సదస్సుకు 29 రాష్ట్రాల నుంచి బీసీ ప్రతినిధులు హాజరుకానున్నారని, ఓబీసీల ఉద్యమానికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.




