Hyderabad: సామాజిక సేవలలో 'నవ లిమిటెడ్' అగ్రగామి
Hyderabad: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (HMA) ప్రతిష్టాత్మక 'సిఎస్ఆర్ అవార్డు 2025-26'ను దక్కించుకున్న 'నవ' లిమిటెడ్.
Hyderabad: సామాజిక సేవలలో 'నవ లిమిటెడ్' అగ్రగామి
Hyderabad: ఈనెల 30న హైదరాబాద్ లో ఐటీసీ కాకతీయ వేదికగా జరిగిన 'హైదరాబాద్ మేనేజ్మెంట్ 2025-26 సిఎస్ఆర్ అవార్డును' ముఖ్య అతిథి త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్.ఇంద్రసేనారెడ్డి మరియు గౌరవ అతిధి జడ్జ్ హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ శ్రీమతి ఎస్.నంద గార్ల చేతులమీదుగా "నవ లిమిటెడ్" ప్రతినిధులు కంపెనీ సెక్రెటరీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వి.ఎస్.ఎన్.రాజు, సి ఎస్ ఆర్ మేనేజర్ శ్రీ సిహెచ్.శ్రీనివాసరావు, సోషల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఎం.శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారు.
సామాజిక కార్యక్రమాలు (ఆరోగ్యం, విద్య, జీవనోపాదులు మరియు ఇతర కార్యక్రమాల) ద్వారా సామాజిక అభివృద్ధికి 'నవ లిమిటెడ్' చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డు దక్కిందని వైస్ ప్రెసిడెంట్ మరియు యూనిట్ హెడ్, తెలంగాణ ఆపరేషన్, రేర్ అడ్మిరల్ ఎల్వి శరత్ బాబు ( V) తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.ఎ, ప్రెసిడెంట్, శ్రీ ఎ.దేవేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, ఎమ్.శరత్ చంద్ర, సెక్రటరీ శ్రీనివాసు దేవన్, ట్రెజరర్ సి.రమేష్ లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ, శ్రీమతి ఎస్. నందన తదితరులు పాల్గొన్నారు.




