Hyderabad: ఎన్.సి.సి ఫౌండర్ ఛైర్మన్, పద్మశ్రీ డాక్టర్ ఏ.వి.ఎస్. రాజు కన్నుమూత!

Hyderabad: ఎన్.సి.సి (నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ) ఫౌండర్ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఏ.వి.ఎస్. రాజు కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.

TELANGANA BUREAU
Published on: 14 Oct 2026 11:32 AM IST
Hyderabad
X

Hyderabad: ఎన్.సి.సి ఫౌండర్ ఛైర్మన్, పద్మశ్రీ డాక్టర్ ఏ.వి.ఎస్. రాజు కన్నుమూత!

Hyderabad: ఎన్.సి.సి గ్రూపు ఫౌండర్ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ ఏ.వి.ఎస్. రాజు కన్నుమూశారు. అక్టోబర్ 13, 2026 రాత్రి తుదిశ్వాస విడిచిన అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, వ్యాపార, సేవా రంగాలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ప్రస్తుత కోనసీమ జిల్లాలో జన్మించిన సత్యనారాయణ రాజు, 1956లో వ్యాపార ప్రస్థానం ప్రారంభించి, 1978లో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించారు.

భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్టేషన్, నీటి పారుదల, పర్యావరణం, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేస్ లాంటి ఎన్నో రంగాల్లో ఆయన కంపెనీ విస్తరించింది. ఒకవైపు వ్యాపారంతో బిజీగా ఉంటూనే, పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాపై 42 సంపుటాల్లో 24 వేల పద్యాలు రాశారు రాజు. మొత్తంగా 25 వేల పద్యాలు వివిధ అంశాలపై రాసిన ఆయనకు, ఒకే పుస్తకంలో అన్ని పద్యాలు రాసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

వ్యాపారంలో ఎదుగుతూనే, ఎన్.సి.సి ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, స్కిల్ డెవలప్‌మెంట్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం బుధవారం ఉదయం ఆయన స్వగృహంలో ఉంచారు. వారి సేవలను కొనియాడిన పలువురు రాజకీయ ఇతర ప్రముఖులు వారి మృతి పట్ల తమ సంతాపాన్ని ప్రకటించారు.

TELANGANA BUREAU

TELANGANA BUREAU