Tarnaka: క్రైస్తవుల హక్కుల కోసం ఎన్‌సీసీ పోరాటం: బిషప్ సంజయ్ ఆనంద్

Tarnaka: క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (NCC) నిరంతరం ఉద్యమిస్తుందని బిషప్ సంజయ్ ఆనంద్ స్పష్టం చేశారు.

HARISH, TARNAKA
Published on: 2 July 2026 4:32 PM IST
Tarnaka
X

Tarnaka: క్రైస్తవుల హక్కుల కోసం ఎన్‌సీసీ పోరాటం: బిషప్ సంజయ్ ఆనంద్

తార్నాక: క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉద్యమిస్తుందని ఎన్సిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ అన్నారు. తార్నాక లోని ఐనోన్ చర్చిలో ఎన్సిసి 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఎన్సిసి ప్రతినిధులు నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మతశక్త దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

ఎస్సీలు క్రైస్తవులలో చేరితే రిజర్వేషన్ చెల్లదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిల్ వేస్తామన్నారు. క్రైస్తవ హక్కుల కోసం సెప్టెంబర్ 9న కడెం లో ఎన్సిసి అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో

ఎన్సిసి జాతీయ అధ్యక్షుడు రెవరెండ్ చిట్టిబాబు, ఎన్సిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క ఏలియా, మహిళా అధ్యక్షురాలు ప్రసన్న బోల్డ్, రాష్ట్ర కన్వీనర్ బిషప్ ఆర్.బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story