hyderabad: డెయిరీ పాడి రైతులకు తీపి కబురు.. అకౌంట్లలోకి రూ. 10 కోట్లు!

hyderabad: నార్ముల్ మదర్ డెయిరీ నిర్వహణను ఎన్డీడీబీకి అప్పగించే ఒప్పంద ప్రక్రియ పూర్తయ్యింది.

AJAY, HAYATH NAGAR
Published on: 12 May 2026 4:31 PM IST
hyderabad
X

hyderabad: డెయిరీ పాడి రైతులకు తీపి కబురు.. అకౌంట్లలోకి రూ. 10 కోట్లు!

హైదరాబాద్: నార్ముల్ మదర్ డెయిరీని ఎన్డీడీబీకి అప్పగించడంలో భాగంగా మంగళవారం ఒప్పంద ప్రక్రియ పుర్తయ్యింది. ప్రభుత్వం తరపున పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సెక్రటరీ ఇలాంబర్తి, ఆలేరు ఎమ్మెల్యే, బీర్ల అయిలయ్య, నార్ముల్ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలు హాజరై ఎన్డీడీబీ ప్రతినిధులతో ప్రక్రియను పూర్తి చేశారు. ఆ వెంటనే పాడి రైతుల పాల బిల్లుల చెల్లింపుకోసం రు. 10 కోట్ల రూపాయలను నార్ముల్ అకౌంట్ కు బదిలీ చేస్తూ సంబంధిత చెక్కును ఎన్డీడీబీ ప్రతినిధులు చైర్మన్ కు అందించారు. కార్యక్రమంలో నార్ముల్ మదర్ డెయిరీ ఎండీ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story