Hayathnagar: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన నీట్ పీజీ పరీక్ష!

Hayathnagar: దేశవ్యాప్తంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రారంభం. తెలంగాణలో 56 కేంద్రాల్లో పరీక్షలు, హయత్‌నగర్‌లో కట్టుదిట్టమైన భద్రత.

AJAY, HAYATH NAGAR
Published on: 30 Aug 2026 12:49 PM IST
Hayathnagar
X

Hayathnagar: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన నీట్ పీజీ పరీక్ష!

Hayathnagar: హయత్‌నగర్‌లో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, దేశవ్యాప్తంగా నీట్ పీజీ (NEET-PG) ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణలో ఈ పరీక్ష రాసేందుకు మొత్తం 17,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మొత్తం 56 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

హయత్‌నగర్‌లోని నీట్ పీజీ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్ష ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనుంది. అభ్యర్థులను ఉదయం 7.00 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.

చివరి నిమిషంలో రద్దీ, ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల నిఘా, అభ్యర్థుల హాజరు కోసం బయోమెట్రిక్ విధానం, మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకుండా సిగ్నల్ జామర్లు ఏర్పాటు చేశారు.

అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఐడీ తప్పనిసరి

పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నీట్ పీజీ అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story