Hyderabad: క్యాబ్‌లో వెళ్లి యువతి అదృశ్యం నేరేడ్‌మెట్‌లో కేసు
Hyderabad: నేరేడ్‌మెట్ పరిధిలో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయిన 18 ఏళ్ల పారల్ ఖాతున్. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏఎస్ఐ సత్యనారాయణ.
Hyderabad: క్యాబ్‌లో వెళ్లి యువతి అదృశ్యం నేరేడ్‌మెట్‌లో కేసు
హైదరాబాద్: నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 18 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీబీఎన్ కాలనీకి చెందిన సంతు సర్కార్ (35), కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు.ఈ నెల 30వ తేదీ ఉదయం ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లగా,భార్య అనుజులా బీబీ వంట పనులకు వెళ్లే ముందు కుమార్తె పారల్ ఖాతున్ (18)కు భోజనం పెట్టి బయటకు వెళ్లింది.
ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో సంతు సర్కార్‌కు అతని స్నేహితుడు రామిన్ ఫోన్ చేసి,పారుల్ ఖాతున్ ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందని సమాచారం అందించాడు.దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న తండ్రి, కుమార్తె కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు,తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
దీంతో నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,పోలీసులు మహిళ అదృశ్యమైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తును ఏఎస్ఐ ఎన్. సత్యనారాయణ చేపట్టారు.యువతి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా నేరేడ్‌మెట్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.




