Malkajgiri: నేరేడ్‌మెట్‌లో ట్రైనీ నర్సుపై లైంగిక దాడి: ఆస్పత్రి ఎండీ అరెస్ట్!

Malkajgiri: నేరేడ్‌మెట్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మైనర్ ట్రైనీ నర్సుపై లైంగిక దాడికి పాల్పడిన ఆస్పత్రి ఎండీ తార్యా నాయక్‌ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 5 Oct 2026 10:25 PM IST
Malkajgiri
X

Malkajgiri: నేరేడ్‌మెట్‌లో ట్రైనీ నర్సుపై లైంగిక దాడి: ఆస్పత్రి ఎండీ అరెస్ట్!

మల్కాజిగిరి, అక్టోబరు 5: నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్ సంతోషిమా నగర్ కాలనీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ట్రైనీ నర్సుగా చేరిన మైనర్ బాలికను ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ తార్యా నాయక్ పలుమార్లు లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనపై బాధితురాలి తల్లి నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు, ఇతర చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri