Boduppal: బోడుప్పల్‌లో నూతన రేషన్ దుకాణాలు ప్రారంభం

Boduppal: బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్ కాలనీల్లో నూతన రేషన్ దుకాణాలను తోటకూర వజ్రెష్, మాజీ మేయర్ అజయ్ యాదవ్ ప్రారంభించారు.

KARUNAKAR, UPPAL
Published on: 2 July 2026 7:44 AM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్‌లో నూతన రేషన్ దుకాణాలు ప్రారంభం

బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధి బోడుప్పల్ సర్కిల్‌ లోని అంబేద్కర్ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ దుకాణాలను బుధవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు, పారదర్శకమైన ప్రజా పంపిణీ వ్యవస్థ అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుతో ఆయా కాలనీల ప్రజలకు నిత్యావసర సరుకులు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేద, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇప్పుడు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందుతున్నాయని చెప్పారు.

అన్ని వర్గాల ప్రజలు నాణ్యమైన ఆహారం తీసుకునేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పాలన సాగిస్తున్నారని కొనియాడారు. నూతన రేషన్ దుకాణాల ప్రారంభంతో బోడుప్పల్ పరిసర ప్రాంతాల వేలాది కుటుంబాలకు మెరుగైన ప్రజా పంపిణీ సేవలు అందనున్నాయి.

ఈ కార్యక్రమంలో కొత్త కిషోర్ గౌడ్, మాజీ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడు కర్రే రాజేష్, మాజీ కార్పొరేటర్లు బొమ్మకు కళ్యాణ్, రసాల వెంకటేష్ యాదవ్, కిరీన్ కుమార్ రెడ్డి, సుమన్ నాయక్, జై రాములు, దేవరకొండ వీరాచారి, పోగుల దిలీప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story