NIMS: నిమ్స్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌ నివాసాలపై ఏసీబీ దాడులు!

NIMS: నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 22 Sept 2026 2:19 PM IST
NIMS
X

NIMS: నిమ్స్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌ నివాసాలపై ఏసీబీ దాడులు!

NIMS: హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్‌ (NIMS) ఆస్పత్రిలో కీలక పదవిలో ఉన్న డాక్టర్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పంజా విసిరారు. నిమ్స్‌ వైద్యుడు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌ నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపడటం కలకలం రేపింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఈ సోదాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.

ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న లక్ష్మీభాస్కర్‌ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 13 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు నిర్వహిస్తూ కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ సుమారు 20 సంవత్సరాలుగా నిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. గత ఐదేళ్లుగా డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, గతంలోనూ ఆయనపై పలు రకాల ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏసీబీ సోదాలు పూర్తియిన తర్వాత పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.