nizampet: నిజాంపేటలో కూలీల ఆందోళన.. రెండు నెలలుగా అందని ఉపాధి హామీ వేతనాలు
nizampet: నిజాంపేట మండలంలో ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. కూలీలు అందకపోతే పోరాటాలు చేస్తామని దళిత బహుజన ఫ్రంట్ హెచ్చరించింది.
nizampet: నిజాంపేటలో కూలీల ఆందోళన.. రెండు నెలలుగా అందని ఉపాధి హామీ వేతనాలు
మెదక్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల దగ్గర కూలీలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దివ్య దేవరాజన్ రాష్ట్రవ్యాప్తంగా సర్కులర్ ఇస్ చేస్తూ గ్రామాలలో సర్పంచులు కార్యదర్శులు ఉపాధి హామీ పనుల దగ్గర ఈ కనీస వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా నిజాంపేట మండలం నస్కల్, నందగోకులం, గ్రామంలో ఉపాధి హామీ పనుల దగ్గర దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ ఆధ్వర్యంలో పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులపై అవలంబిస్తున్న అంశాల పైన కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ గ్రామాలలో గత ఏడు వారాలుగా ఉపాధి హామీ పనులు చేస్తున్నప్పటికీ నేటికీ ఒక్క వారం కూలీ డబ్బులు కూడా అందలేదని కూలీలు అసహనం వ్యక్తం చేశారు.
మండుటెండలో పనులు చేస్తున్న ప్రభుత్వాలకు కనికరం లేదని పొట్ట తిప్పలు కోసం కూలి పని చేస్తుంటే 15 రోజులలో అందియవలసిన డబ్బులు రెండు నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులు రాకపోవడం పై ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యాన్ని కనుల కట్టినట్టుగా ఉందని వారన్నారు. ఒకపక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగిస్తూ విబిజి గ్రామ్ జి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉపాధి కూలీల హక్కులను కాలరాసే విధంగా ఉందని ఉపాధి కూలీల పొట్ట కొట్టే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుందని ఆయన తీయబెట్టారు. ఉపాధి హామీ కూలీల హక్కులను కాల రాస్తే గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో కూలీల పోరాటం చేయవలసి వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. ఏది ఏమైనాప్పటికీ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు కూలి వేతనాలు అందించాలని లేనిపక్షంలో ధర్నాలకు రాస్తరోకోలకు దారితీసే అవకాశం ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ మేటు కరుణాకర్ ఉపాధి కూలీలు మహిళలు పాల్గొన్నారు.




