Uppal: సేవా కార్యక్రమాలతో ఎన్‌ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ నంబూరి రవి బర్త్‌డే

Uppal: ఉప్పల్‌లో ఎన్‌ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ నంబూరి రవి జన్మదిన వేడుకలు. పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు, అన్నదానం నిర్వహణ.

KARUNAKAR, UPPAL
Published on: 1 July 2026 6:43 PM IST
Uppal
X

Uppal: సేవా కార్యక్రమాలతో ఎన్‌ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ నంబూరి రవి బర్త్‌డే

ఉప్పల్: జన్మదినాన్ని కేవలం కేక్ కట్‌తో కాకుండా సమాజానికి సేవ చేసే కార్యక్రమాలతో జరుపుకోవాలనే సందేశాన్ని చాటుతూ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ నంబూరి రవి జన్మదిన వేడుకలు ఉప్పల్‌లో ఘనంగా నిర్వహించారు. సంస్థ మార్కెటింగ్ విభాగం, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి వేడుకలకు ప్రత్యేకత తీసుకొచ్చారు.

ఉప్పల్‌ లోని ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సంస్థ సిబ్బంది, మార్కెటింగ్ ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నంబూరి రవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి అందరితో కలిసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సంస్థ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటగా, ఉచిత వైద్య శిబిరంలో పలువురు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి భోజనం అందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ నంబూరి రవి మాట్లాడుతూ, "పుట్టినరోజు అంటే కేవలం కేక్ కట్ చేయడం, శుభాకాంక్షలు స్వీకరించడం మాత్రమే కాదు. సమాజానికి ఉపయోగపడే ఒక్క మంచి పని చేసినా ఆ పుట్టినరోజుకు నిజమైన అర్థం వస్తుంది. మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ కుటుంబ సభ్యులు రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ కేవలం రియల్ ఎస్టేట్ సంస్థ మాత్రమే కాదు.. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ సామాజిక బాధ్యతను నెరవేర్చే సంస్థగా ముందుకు సాగుతోంది" అని అన్నారు. సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ బృందం, ఉద్యోగులు, సంస్థ ప్రతినిధులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story