Secunderabad: భర్త ఆస్తి కోసం ఎన్నారై భార్య పోరాటం!
Secunderabad: సికింద్రాబాద్ మారేడుపల్లి ఎల్ఐసి కాలనీలో అత్తగారి ఇంటి ముందు ఎన్నారై కోడలు రజిత తన కూతురితో కలిసి రాత్రి నుండి ధర్నాకు దిగారు.
Secunderabad: భర్త ఆస్తి కోసం ఎన్నారై భార్య పోరాటం!
Secunderabad: సికింద్రాబాద్ మారేడుపల్లి ఎల్ఐసి కాలనీలో అత్తగారి ఇంటి ముందు ఎన్నారై కోడలు రాత్రి నుండి ధర్నాకు దిగారు.. కోడల్ని ఇంట్లోకి రాకుండా అత్త ఇంటికి తాళాలు వేసుకోవడంతో ఇంటిముందు కోడలు మనవరాలు కూర్చుని ధర్నా కొనసాగిస్తున్నారు.
వరంగల్ ప్రాంతానికి చెందిన ఉన్నాడు లక్ష్మి అలియాస్ రజిత కి మారేడ్పల్లి ఎల్ఐసి కాలనీకి చెందిన రాము తో 2002లో వివాహం జరిగింది. అనంతరం యూఎస్ కు వెళ్లారు. రాము రజిత దంపతులకు ఓ కూతురు జన్మించింది. రాము గుండె సంబంధిత వ్యాధితో 2019లో చనిపోయాడు.
ఇటీవల రాము కుటుంబ సభ్యులు ఫ్యామిలీ సర్టిఫికెట్ రెవెన్యూ శాఖ అధికారుల నుండి పొందారు అయితే.. రాము పేరు లేకపోవడంతో విషయం తెలుసుకున్న భార్య కూతురు అత్తగారి ఇంటికి వచ్చి ప్రశ్నించారు. దీంతో ఇంట్లోకి రాకుండా ఎన్నారై కోడల్ని అత్త మరిది అడ్డుకోవడంతో ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తున్నారు.
తన భర్తకు సంబంధించిన ఆస్తిని ఖాళీ చేసేందుకు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారని దీంతో తమకు అన్యాయం జరుగుతుందని.. భార్య లక్ష్మి కూతురు త్రిష లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




