Secunderabad: గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థిని మరణం

Secunderabad: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స వికటించి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థిని పల్లవి గౌడ్ మృతి చెందింది.

SRIKANTH, TANDUR
Published on: 23 May 2026 2:50 PM IST
Secunderabad
X

Secunderabad: గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థిని మరణం

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో వైద్యం వికటించి నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది..గాంధీ మెడికల్ కాలేజీలో బి ఎస్ సి సెకెండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ కు ఛాతి భాగంలో ఓ కురుపు రావడంతో డాక్టర్స్ సలహాలు తీసుకొని సర్జరీ చెంచుకోవడానికి నిర్ణయించుకుంది..ఫిట్ పర్ సర్జరీ పేరుతో ఈ నెల 19 న డాక్టర్స్ చేశారని గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ వాణి తెలిపారు.

సర్జరీ అనంతరం ఓవర్ బ్లీడింగ్ కావడంతో మరోసారి సర్జరీ నిర్వహించగా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తో వైద్యానికి బాడీ సహకరించక మృతి చెందినట్లు సూపరిండెంట్ తెలిపారు..విద్యార్థిని మృతి బాధాకరమని,అందుకు గాను ఎంక్వయిరీ టిమ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు…కాగా తన కూతురు డాక్టర్ల నిర్లక్ష్యం తోనే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్పత్రిలో చదువుతున్న విద్యార్థిని ధైర్యంతో సర్జరీ చేయించుకుంటే ఇలా ప్రాణాలు పోవడం బాధాకరమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మెంబర్ విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story