Hyderabad: కూతురిని వేధించవద్దన్నందుకు తండ్రిని పొడిచి చంపిన యువకుడు!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేటలో దారుణం. కూతురిని వేధించవద్దని మందలించినందుకు హస్మత్‌ను కత్తితో పొడిచి చంపిన యువకుడు మొహమ్మద్. కొడుకుపై దాడి.. పోలీసుల కేసు నమోదు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 17 Sept 2026 11:33 PM IST
Hyderabad
X

Hyderabad: కూతురిని వేధించవద్దన్నందుకు తండ్రిని పొడిచి చంపిన యువకుడు!

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కూతురిని వేధించవద్దంటూ మందలించినందుకు హస్మత్(55) అనే వ్యక్తిని పక్కింటి యువకుడు మొహమ్మద్ కత్తితో పొడిచి హతమార్చాడు. అడ్డువచ్చిన హస్మత్ కుమారుడు ఉమర్‌పై కూడా కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు

మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్-ఎ-జహారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన కూతురిని వేధిస్తున్నాడంటూ మొహమ్మద్‌ను హస్మత్ మందలించడంతో ఆగ్రహానికి గురైన మొహమ్మద్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

కత్తిపోట్లకు గురైన హస్మత్ ఘటనాస్థలంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన ఉమర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాదన్న పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA