Hyderabad: వైభవంగా లాల్ దర్వాజా మహంకాళి 118వ బోనాల ఉత్సవాలు

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి 118వ బోనాలు ప్రారంభం. మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్ నివాసం నుంచి సమర్పించిన తొలి బోనం.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 31 July 2026 4:42 PM IST
Hyderabad
X

Hyderabad: వైభవంగా లాల్ దర్వాజా మహంకాళి 118వ బోనాల ఉత్సవాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు రంగులతో అందంగా అలంకరించారు.

తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే చరిత్రాత్మక పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుండి ప్రారంభం.

మొదటి బంగారు బోనం మరియు వెండి బోనం సమర్పణ మాజీ చైర్మన్ సీనియర్ అడ్వకేట్ మాణిక్ ప్రభు గౌడ్ ఇంటి నుండి అత్యంత వైభవంగా బాజా బజంత్రీల నడుమ అమ్మవారికి సమర్పించారు.

పిదప మీడియా తో మాట్లాడుతూ అలనాడు నిజాం కాలం లో వరదలు వచ్చి నప్పుడు అమ్మవారు వెలిసి వరదలను అదుపు చేశారు అప్పటి నుండి అమ్మవారికి బోనం భక్తులు సమర్పిస్తూ వస్తున్నారు.

ఈ అమ్మవారిని కోరుకొనే కోరికలు తీర్చే అమ్మవారు అమ్మవారి ప్రతిష్ఠ దేశ విదేశాలకు మారు పేరు వచ్చే నెల తొమ్మిది పది తేదీలలో అమ్మవారికి బోనాలు సమర్పణ రంగం కార్యక్రమం తో పోత రాజుల మధ్య జూలూస్ రూపం లో ముగిస్తుంది.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY