Hyderabad: జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద మారనున్న ట్రాఫిక్ రూల్స్!

Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేయనున్నారు. అంబులెన్సులు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

Arun Goud, Hyderabad
Published on: 14 Aug 2026 10:41 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద మారనున్న ట్రాఫిక్ రూల్స్!

హైదరాబాద్: నగరంలో అత్యంత రద్దీగా ఉండే కెబిఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18వ తేదీ (18.08.2026) నుండి కెబిఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఒకే వైపు (వన్-వే) ట్రాఫిక్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ నూతన ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శ్రీ జోయెల్ డేవిస్ ఐపీఎస్, ట్రాఫిక్ డిసిపి-II శ్రీమతి కాజల్ ఐపీఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆసుపత్రులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు మరియు ఇతర నిపుణులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి: నూతన ట్రాఫిక్ మార్పుల వల్ల ఆసుపత్రులకు వచ్చే అత్యవసర అంబులెన్సులు, రోగులు, ఆసుపత్రి సిబ్బంది మరియు వ్యాపార సంస్థల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలపై కూడా ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరించారు.

ట్రాఫిక్ పోలీసుల పిలుపు: నూతన నిబంధనల అమలు విజయవంతం కావడానికి వాహనదారులు, స్థానిక సంస్థల పూర్తి సహకారం అవసరమని జాయింట్ కమిషనర్ తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా తమ మార్గాలను ప్రణాళిక చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ సిబ్బంది ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాన ఉద్దేశం: కెబిఆర్ పార్క్ సర్కిల్ వద్ద నిరంతరం ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడమే ఈ వన్-వే అమలు ముఖ్య ఉద్దేశమని అధికారులు వివరించారు. ఈ మార్పులు అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తామని జాయింట్ కమిషనర్,ట్రాఫిక్ గారు వెల్లడించారు. జారీ చేసిన వారు- జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, ట్రాఫిక్, హైదరాబాదు సిటీ.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad

Next Story