Talakondapally: కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డికి మాతృ వియోగం

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి కాసు సీతమ్మ వృద్ధాప్యంతో కన్నుమూశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Aug 2026 9:39 PM IST
Talakondapally
X

Talakondapally: కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డికి మాతృ వియోగం

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి మాతృ వియోగం జరిగింది.వృద్ధాప్యంతో బాధపడుతూ కాసు శ్రీనివాస్ రెడ్డి యొక్క మాతృమూర్తి కాసు సీతమ్మ ఈరోజు మధ్యాహ్నం పరమపదించారు.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగరావుపల్లి గ్రామానికి చేరుకొని కాసు సీతమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మృతురాలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు.

అనంతరం కాసు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహా,,ఏఎంసీ డైరెక్టర్ అంజయ్య గుప్తా, మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లట్టుపల్లి రమాదేవి జగ్గారెడ్డి , కిసాన్ సెల్ కాంగ్రెస్ నాయకులు దోమ మోహన్ రెడ్డి,వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి ,సంజీవరెడ్డి, తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story