AS Rao Nagar: అమ్మవారి కానుకల చీరలకు బహిరంగ వేలం: ఈవో ప్రకటన
AS Rao Nagar: కమలానగర్ శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దేవస్థానంలో లలితాంబిక అమ్మవారి కానుకల చీరలకు నవంబర్ 16, 23, 30 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.
AS Rao Nagar: అమ్మవారి కానుకల చీరలకు బహిరంగ వేలం: ఈవో ప్రకటన
ఏఎస్ రావునగర్: ఏఎస్ రావునగర్ డివిజన్ కమలానగర్ టీజీఐసీ కాలనీలోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు శ్రీ లలితాంబిక అమ్మవారికి కానుకగా సమర్పించిన చీరలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి సిహెచ్. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
అమ్మవారికి అలంకరించిన అనంతరం తీసిన చీరలను నవంబర్ 16, 23, 30 తేదీల్లో సోమవారాల్లో ఉదయం 10.30 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల భక్తులు, ప్రజలు నిర్ణీత సమయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని కోరారు. వేలం నిబంధనలను వేలం సమయంలో చదివి వినిపించనున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు.




