LB Nagar: చైతన్యపురి పోలీసుల అప్రమత్తతతో దొరికిన నల్గొండ బాలుడు!
LB Nagar: చైతన్యపురి పోలీసులు "ఆపరేషన్ ముస్కాన్-XII"లో భాగంగా DARPAN యాప్ ఫేస్ రికగ్నిషన్ సాయంతో నల్గొండ వన్‌టౌన్‌కు చెందిన మిస్సింగ్ బాలుడిని గుర్తించారు.
LB Nagar: చైతన్యపురి పోలీసుల అప్రమత్తతతో దొరికిన నల్గొండ బాలుడు!
LB నగర్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో చేపట్టిన "ఆపరేషన్ ముస్కాన్-XII"లో చైతన్యపురి పోలీసులు సాంకేతికత సహాయంతో కనిపించకుండా పోయిన ఓ బాలుడిని గుర్తించి కుటుంబానికి చేరువ చేసే దిశగా కీలక విజయాన్ని సాధించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "ఆపరేషన్ ముస్కాన్-XII"లో భాగంగా ఎల్బీనగర్ డివిజన్ ఏసీపీ ఏ. కృష్ణయ్య పర్యవేక్షణలో చైతన్యపురి పోలీసులు ఫణిగిరి కాలనీలోని ఆదర్శ చిల్డ్రన్స్ హోమ్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమయంలో హోమ్‌లో ఉన్న ఓ బాలుడి వివరాలు DARPAN యాప్‌లో నమోదు కాలేదని గుర్తించిన పోలీసులు, వెంటనే అతని ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేశారు.
ఫేస్ మ్యాచింగ్ టెక్నాలజీ ద్వారా ఆ బాలుడి వివరాలు నల్గొండ జిల్లా AHTU వద్ద నమోదైన మిస్సింగ్ రికార్డుతో సరిపోలాయి.
వెంటనే పోలీసులు పూర్తి వివరాలు ధృవీకరించగా, నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులో ఈ బాలుడు కనిపించకుండా పోయినట్లు నిర్ధారణ అయింది.
అనంతరం నల్గొండ AHTU అధికారులకు సమాచారం అందించి, బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభించారు.
DARPAN యాప్ వినియోగంతో కనిపించని బాలుడిని గుర్తించడం ద్వారా మరో కుటుంబంలో ఆశలు నింపిన చైతన్యపురి పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.




