Medchal: నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియెంటేషన్ డే!
Medchal: మేడ్చల్ జిల్లా నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ డే ఘనంగా నిర్వహించారు.
Medchal: నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియెంటేషన్ డే!
Medchal: మేడ్చల్ జిల్లా మైసమ్మగూడాలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావు అతిథిగా హాజరుకాగా, క్యాప్‌జెమినీ సీనియర్ మేనేజర్ అంకుర్ మిట్టల్, సోషల్ గవర్నెన్స్ అడ్వైజర్, POSH పాలసీ నిపుణురాలు రోహిణి నాయుడు, వి యాక్సిస్ లెర్నింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ వికాస్ సురేంద్రన్, మైక్రోసాఫ్ట్ సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ రజిని కాసల,
ఇంటర్నేషనల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్ పారుల్ ఖురానా, పోలీస్ శాఖకు చెందిన మోటివేషనల్ స్పీకర్ డి.జి. రామ్ మూర్తి, గ్రాడ్‌స్ట్రీట్ సీఈఓ కె. దుర్గ నవీన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నర్సింహారెడ్డి, కార్యదర్శి త్రిశూల్ రెడ్డి ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూసే "జాబ్ సీకర్స్"గా కాకుండా, పదిమందికి ఉపాధి కల్పించే "జాబ్ క్రియేటర్స్"గా ఎదగాలని సూచించారు.
ఇందుకోసం విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్), ప్లేస్‌మెంట్ అవకాశాలపై దృష్టి సారించడంతో పాటు వినూత్న ఆలోచనలను (ఇన్నోవేషన్ థాట్ ప్రాసెస్) పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక ప్రయోగశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలతో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన అభప్రాయపడ్డారు.




