OU: ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ‘రుద్రం’ కలరి ప్రదర్శన!
OU: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘రుద్రం’ కలరిపయట్టు భారతీయ సంప్రదాయ యుద్ధకళా ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు.
OU: ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ‘రుద్రం’ కలరి ప్రదర్శన!
OU: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ‘రుద్రం’ పేరుతో భారతీయ సంప్రదాయ యుద్ధకళ కలరిపయట్టు ప్రదర్శన నిర్వహించడం గొప్ప అవకాశమని ‘రుద్రం’ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల రాఘవ అన్నారు. ఆర్ట్స్ కళాశాల మహిళా సాధికారత విభాగం సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. మహిళల్లో ఆత్మరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు భారతీయ సంప్రదాయ యుద్ధకళల గొప్పతనాన్ని చాటిచెప్పడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ స్వాతి, ప్రొఫెసర్ మాయాదేవి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు ఆత్మరక్షణలో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, భారతీయ యుద్ధకళలపై అవగాహన పెంచుకోవడానికి ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.




