Hyderabad: ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో 4% రిజర్వేషన్ అమలు చేయాలి!

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో భర్తీ చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నేతలు వీసీకి వినతిపత్రం ఇచ్చారు.

HARISH, TARNAKA
Updated on: 18 Nov 2026 2:30 PM IST
Hyderabad
X

Hyderabad: ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో 4% రిజర్వేషన్ అమలు చేయాలి!

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో భర్తీ చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం నియామకాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తరహాలోనే యూనివర్సిటీలో పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై వైస్‌ ఛాన్సలర్‌ కుమార్‌ సానుకూలంగా స్పందించినట్లు సమితి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నాయకులు బాణాల వెంకటయ్య, పల్స ఆంజనేయులు గౌడ్‌, వెంకన్న, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA