Osmania University: ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్‌లో పేటెంట్లపై ఓయూ ప్రత్యేక వర్క్‌షాప్

Osmania University: ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ విభాగాల్లో కూడా పేటెంట్లు సాధించవచ్చని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన వర్క్‌షాప్‌లో నిపుణులు పేర్కొన్నారు.

HARISH, TARNAKA
Published on: 22 April 2026 4:13 PM IST
Osmania University
X

Osmania University: ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్‌లో పేటెంట్లపై ఓయూ ప్రత్యేక వర్క్‌షాప్

ఉస్మానియా యూనివర్సిటీ: పేటెంట్స్ ను సాధించడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా వ్యవస్థాపరంగా కూడా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ 99 డే "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, యు జి సి అఫైర్స్ అండ్ డెవలప్మెంట్ డీన్ ల ఆధ్వర్యంలో " పేటెంట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ " అనే అంశంపై ఓయూ ఆర్ట్స్ కళాశాల లో బుధవారం వర్క్ షాపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పేటెంట్స్ అనేవి సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ విభాగాల్లో కూడా సాధించవచ్చునని వివరించారు.

ఒక ఫ్యాకల్టీ మెంబర్ కు పేటెంట్ రావడం వల్ల వ్యక్తిగతంగా గుర్తింపుతో పాటు పదోన్నతులలో మార్కులు, ఆదాయం లభించడం, యూనివర్సిటీకి యు జి సి - న్యాకు గ్రేడులు, ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకులు పొందడం తో పాటు దేశ ప్రగతి కి కూడా పేటెంట్లు ఉపయోగపడతాయని ఆయన విశ్లేషించారు. కార్యక్రమానికి మరో వక్తగా హాజరైన ఓయూ సోషియాలజీ బి ఓ ఎస్ చైర్మన్ డాక్టర్ బీనవేణి రామ్ షెఫర్డ్ మాట్లాడుతూ పేటెంట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ : స్కోప్, టైప్స్ అండ్ ఫైలింగ్ ప్రొసీజర్ " అనే అంశంపై వివరించారు. కార్యక్రమానికి హాజరైన ఓయూ యూజీసీ అఫైర్స్ అండ్ డెవలప్మెంట్ డీన్ ప్రొఫెసర్ బి. లావణ్య మాట్లాడుతూ యూనివర్సిటీ కి మంచి ర్యాంకులు రావడంలో రీసెర్చ్ ప్రాజెక్టులు , పరిశోధనా పత్రాలతో పాటు పేటెంట్స్ కూడా ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. స్వాతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story