Osmania University: ఓయూకు రూ. 1000 కోట్లు కేటాయించాలి
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్. ఓయూ లా కాలేజీ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ తీరుపై ఆగ్రహం.
Osmania University: ఓయూకు రూ. 1000 కోట్లు కేటాయించాలి
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీని అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఓయూ లా కళాశాలలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఓయూ లా కళాశాల విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఐదారు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. మెస్ సౌకర్యం అనుకూలంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీటి సమస్యతో పాటు విద్యార్థుల గదుల్లోకి పాములు వస్తున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుండగా, వినాయక చవితి వేడుకలను కూడా సంప్రదాయం కొనసాగించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారని చెప్పారు.
మంత్రి సీతక్క కూడా ఓయూ విద్యార్థేనని, ఇక్కడి విద్యార్థుల సమస్యలను కనీసం పట్టించుకోవాలని కవిత కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లా కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని, అవసరమైతే వారితో కలిసి పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.




