Osmania University: ఓయూలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు.
Osmania University: ఓయూలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తురష్క సైనికులు అరాచకాలను,పన్ను శిస్తు విధానాలను లను వ్యతిరేకించిన వ్యక్తి అన్నారు.
తెలంగాణ లో మొఘలు రాజ్యంలో ప్రజల పై జమీందారులు,జాగీర్దాలు దొరలు,భూస్వాములు చేస్తున దోపిడీని,అరాచకాలను చూసి గోల్కొండ ఖిలా పై బహుజన రాజ్యాధికారం జెండా ఎగురవేయాలని పరితపించి జెండా ఎగురవేసిన బహుజన విప్లవవీరుడు పాపన్న అని వారు తెలిపారు.
పాపన్న యుద్ధం గెలిచిన ప్రతి సారి విజయ దుర్గాలను ఏర్పాటు చేసేవారు అని వారు అన్నారు. పాపన్న గెరిల్లా సైన్యం ను తయారు చేసుకొని మొఘల్ సామ్రాజ్యం పై దండ యాత్ర చేసిన గొప్ప సాహసికుడు అని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించే దిశ గా విద్యార్థులు,యువత పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జెవిఎస్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు చీరాల వంశీ,బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మామిడాల రవి కుమార్,ఓయు బీసీ విద్యార్థి నాయకులు ఆవుల శ్రీధర్ యాదవ్, విద్యార్థి నాయకులు ప్రభాకర్,సాయి కిరణ్ ,సురేందర్,ఓంకార్,రోహన్,నవీన్,నరేష్,రవి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు




