Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో తపస్య విద్యాసంస్థల స్నాతకోత్సవ వేడుకలు
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో తపస్య విద్యాసంస్థల స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వీసీ చేతుల మీదుగా వెయ్యి మంది విద్యార్థులను సన్మానించారు.
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో తపస్య విద్యాసంస్థల స్నాతకోత్సవ వేడుకలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో తపస్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచ్ లకు చెందిన దాదాపు వెయ్యి మంది విద్యార్థులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డీజీఎం లు కృష్ణమూర్తి, సతీష్, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తమ విద్యాసంస్థకు ఎనిమిది బ్రాంచ్‌లు ఉన్నాయని, వాటిలో సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.
ప్రతి సంవత్సరం విద్యార్థుల విద్యా, ఉద్యోగ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తిస్తూ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి, రూ.10 లక్షల వరకు వేతన ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్లు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.
విద్యార్థులు సాధించిన విజయాలు తమ సంస్థకు గర్వకారణమని, విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ తపస్య విద్యాసంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు సహకరించిన ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యానికి, వైస్ ఛాన్సలర్ కు తపస్య మేనేజ్‌మెంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




