Hyderabad: ఆర్టీసీ ఉద్యోగులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

Hyderabad: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఓయూ జేఏసీ ఛైర్మన్ రెడ్డి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు.

HARISH, TARNAKA
Published on: 24 April 2026 3:30 PM IST
Hyderabad
X

Hyderabad: ఆర్టీసీ ఉద్యోగులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

Hyderabad: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని, సంస్థ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని, ప్రాణాల మీదికి తెచ్చుకునేలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఓయూ జేఏసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మె అంశంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

ఉద్యోగుల సంక్షేమమే యాజమాన్యం ప్రధాన ధ్యేయమని సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రక్రియపై పూర్తి నమ్మకంతో ఉండాలని కోరారు. ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించడం ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు బోనాల నాగేష్.మహిపాల్, శివ గౌడ్, ప్రవీణ్. ఉదయ్,రహీమన్ హరీష్.తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story