Ameerpet: ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలి.. ఓయూ జేఏసీ డిమాండ్
Ameerpet: హైదరాబాద్ అమీర్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు డిమాండ్ చేశారు.
Ameerpet: ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలి.. ఓయూ జేఏసీ డిమాండ్
Ameerpet: అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు టి కే శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అయిన తెలంగాణ లో వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. కొంతమందికి తెలంగాణ పట్ల ఇంకా విద్వేషం పోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు కొండ లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారని, వారి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఉద్యమకారులను అవమానించే విధంగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఇప్పటికైన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో మిలియన్ మార్చ్ తరహా లో విద్యార్థులు ఉద్యమిస్తారని హెచ్చరించారు.




