Osmania University: దళితులను అవమానించడం సరికాదు.. కేసీఆర్‌పై ఓయూ జేఏసీ ఆగ్రహం!

Osmania University: కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద పసుపు నీళ్లు చల్లి దళితులను అవమానించారని ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదుట తీవ్ర నిరసన చేపట్టారు.

HARISH, TARNAKA
Published on: 10 Sept 2026 4:22 PM IST
Osmania University
X

Osmania University: దళితులను అవమానించడం సరికాదు.. కేసీఆర్‌పై ఓయూ జేఏసీ ఆగ్రహం!

ఉస్మానియా యూనివర్సిటీ: మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్దకు దళితులు వచ్చారనే కారణంతో బీఆర్‌ఎస్‌ నాయకులు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడాన్ని ఓయూ జేఏసీ చైర్మన్‌ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండించారు. గురువారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. దళితులను బీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నచూపు చూడటం సరికాదన్నారు. రానున్న ఎన్నికల్లో కేటీఆర్‌, హరీశ్‌రావులను ఓడించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

దళిత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు దళిత సమాజానికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రమేష్, రాజేందర్, చరణ్, స్వామి అరుణ్, ఆకాష్, కుశాల్, ఆంజనేయులు, వెంకటేష్, అఖిల్, రాజు, సాయి, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story