Hyderabad: రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఓయూలో విద్యార్థిసేన సమరభేరి!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Hyderabad: రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఓయూలో విద్యార్థిసేన సమరభేరి!
Hyderabad: రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో విద్యార్థిసేన ఆధ్వర్యంలో నిరుద్యోగ పోరుదీక్ష కు పూనుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల విషయాన్నీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు అన్ని శాఖల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో, కేవలం ఐదు వేల పోలీసు పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ విడుదల చేయడం నిరాశ కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.




