Hyderabad: నిరుద్యోగులకు వరం.. వయోపరిమితి 44 ఏళ్లకు పెంచిన సర్కార్

Hyderabad: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై OU లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

HARISH, TARNAKA
Published on: 19 May 2026 5:15 PM IST
Hyderabad
X

Hyderabad: నిరుద్యోగులకు వరం.. వయోపరిమితి 44 ఏళ్లకు పెంచిన సర్కార్

Hyderabad: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ళ నుండి 44 ఏళ్ళకు పెంచటాన్ని హర్షిస్తూ ఓయూ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగ జెఏసి నాయకుడు డాక్టర్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలో నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సుమారు 40 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.

కొంతమంది వారి రాజకీయ ప్రయోజనాలకోసం ఆర్థిక ప్రయోజనాల కోసం కృత్రిమ నిరుద్యోగ నాయకుల అవతారమెత్తారని వారి ఉచ్చులో నిజమైన నిరుద్యోగులు పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జెఏసి నాయకులు రాథోడ్ రవీంద్ర నాయక్, నిరుద్యోగ జెఏసి నాయకులు జగన్నాథ్ యాదవ్, అశోక్, హేమంత్ చౌదరి,నాగార్జున,దేవ్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story