Tarnaka: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా సెప్టెంబర్ 16న భారీ సభ!

Tarnaka: ఉద్యమకారుల గుర్తింపుపై సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పాలాభిషేకం.

HARISH, TARNAKA
Published on: 31 Aug 2026 6:45 PM IST
Tarnaka
X

Tarnaka: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా సెప్టెంబర్ 16న భారీ సభ!

Tarnaka: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని ఓయూ జేఏసీ నాయకుడు బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడాన్ని స్వాగతిస్తూ, ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్యమకారులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ, కేకే కమిటీ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి నాలుగు ప్రధాన అంశాలను గుర్తించి ముఖ్యమంత్రికి నివేదిక అందించిందని తెలిపారు.

ఉద్యమకారులకు గుర్తింపు కల్పించడంతో పాటు 250 గజాల స్థలం, పెన్షన్, బస్సు సౌకర్యం, గుర్తింపు కార్డుల అంశాలను ప్రభుత్వం పరిశీలించడం అభినందనీయమని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల సంక్షేమంపై దృష్టి సారించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.

సెప్టెంబర్ 16న జరగనున్న రెండు తరాల తెలంగాణ ఉద్యమకారుల సభను సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభగా నిర్వహించనున్నట్లు పిడమర్తి రవి ప్రకటించారు. ఈ సభకు వేలాదిగా తెలంగాణ ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఉద్యమకారుల కోసం ఆన్‌లైన్ సౌకర్యాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వానికి అండగా నిలిచి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారధులుగా పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story