LB Nagar: ఎల్బీనగర్: 50 అడుగుల జెండాతో విద్యార్థుల ర్యాలీ!

LB Nagar: ఎల్బీనగర్ ఆక్స్ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు 50 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 Aug 2026 12:29 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్: 50 అడుగుల జెండాతో విద్యార్థుల ర్యాలీ!

LB Nagar: 50 అడుగుల త్రివర్ణ పతాకంతో విద్యార్థుల ర్యాలీ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ఆక్స్ఫర్డ్‌ హైస్కూల్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీనగర్‌ ఆక్స్ఫర్డ్‌ హైస్కూల్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. 50 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ పుణ్యవతి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను విద్యార్థులకు తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను, దేశభక్తి స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించి.. మహనీయుల ఆశయ సాధనలో ముందుకు సాగాలని సూచించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story