Chandanagar: ‘వన్ డే వన్ వార్డ్’.. అధికారులతో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్ష!
Chandanagar: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలో 'వన్ డే - వన్ వార్డ్' కార్యక్రమం జరిగింది.
Chandanagar: ‘వన్ డే వన్ వార్డ్’.. అధికారులతో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్ష!
చందానగర్: డివిజన్ పరిధిలోని KSR ఎనక్లేవ్ కాలనీ లో గల ఫ్రీ డమ్ పార్క్ లో జరిగిన వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై గౌరవ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ అధికారి శ్రీమతి జి. సృజన గారు, గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ నారాయణ్ అమిత్ మాలెంపాటి గారు, గౌరవ డీసీ శ్రీ శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు శ్రీ రఘునాథ్ రెడ్డి గారు, మరియు CMC పలు విభాగాల అధికారులు , కాలనీల రేసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు
ఈ సందర్బంగా గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు మాట్లాడుతూ వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కాలనీల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో CMC అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించుకోవడం జరిగినది.కాలనీల వాసులు పలు సమస్యలను మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులను కమిషనర్ గారి దృష్టికి , నా దృష్టికి తీసుకురావడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. కాలనీల సమస్యలను ప్రథమ ప్రాధాన్యత గా తీసుకొని త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని, పనులలో అలసత్వం ప్రదర్శించకుండా త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
గంగారం చెరువు సుందరీ కరణ పనులు వేగవంతం చేస్తామని, గంగారం హనుమాన్ దేవాలయం నుండి అపర్ణ హిల్ పార్క్ వరకు లింక్ రోడ్డు ను పూర్తి చేయాలని , PA నగర్ కాలనీ లో స్మశాన వాటిక ప్రహారీ గోడ ను నిర్మించాలని, KSR ఎనక్లేవ్ కాలనీ మరియు ఫ్రెండ్స్ కాలనీ లలో పార్కు లను అభివృద్ధి చేయాలని, KSR ఎనక్లేవ్ కాలనీ లో వరద నీటి కాల్వ నిర్మించాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
చందా నగర్ డివిజన్ పరిధి లోనీ పార్క్ లను అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనంలు గా తీర్చిదిద్దుతామని, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తామని , పిల్లలు, వృద్ధులు సేద తీరడానికి అనువుగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని, కాలనీలలో ప్రజలకు చక్కటి ఆహ్లాదకమైన ,ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
అదేవిధంగా చందానగర్ వార్డ్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సృజన IAS గారి తో చర్చించడం జరిగింది , పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, సీసీ రోడ్ల కు నిదులు మంజూరి చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ గారు కోరారు.
వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన నాలల విస్తరణ పనులు చేపట్టాలని, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని, పార్క్ ల అభివృద్ధి మరియు సుందరీకరణ చేపట్టాలని, పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కాలనీ లో పార్క్ లను అభివృద్ధి చేయాలని ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని PAC చైర్మన్ గాంధీ గారు కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది.
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేస్తామని, చందానగర్ వార్డ్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ షేక్తుల కృషి చేస్తానని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటి ని ఒడిసి పట్టుకోవాలని, ఇంటి ఆవరణ ప్రాంతంలో ఇంకుడు గుంత ను ఏర్పాటు చేసుకొని ప్రతి కాలనీ కి ఆదర్శంగా నిలవాలని ఒక సామాజిక బాధ్యత గా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని , మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడి చేత పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య ఆటో సిబ్బందికి అందచేయాలని, పారిశుధ్య సిబ్బంది కాలనీలలో పేరుకుపోయిన చెత్త చెదరం ,మట్టి కుప్పలను ఎప్పటికప్పుడు తొలగించాలని, చక్కటి ఆహ్లదకరమైన వాతావరణంను అందించాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు. టౌన్ ప్లానింగ్ విభాగం, జలమండలి విభాగం మరియు నాయకులు ,కార్యకర్తలు, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




