Gachibowli: జనచైతన్య కాలనీలో పర్యటించిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ!

Gachibowli: డివిజన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ జనచైతన్య కాలనీలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పర్యటించి కాలనీ సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 19 Aug 2026 8:10 AM IST
Gachibowli
X

Gachibowli: జనచైతన్య కాలనీలో పర్యటించిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ!

Gachibowli: డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ జన చైతన్య కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో పర్యటించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ జనచైతన్య కాలనీ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెక పూడి గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని, కాలనీ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి నీ మరువలేం అని కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీ గారికి తెలియచేశారు.

అదేవిధంగా కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపర్చాలని, అవసరం ఉన్న చోట వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు PAC చైర్మన్ గాంధీ గారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ జనచైతన్య కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు కాలనీ లో పర్యటించడం జరిగినది అని, కాలనీ వాసులు నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్య ను పరిష్కరిస్తానని, కాలనీ లో దశల వారీగా పనులు ప్రారంభిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.

అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లు, UGD పనులు దశల వారీగా అమలు చేస్తామని, UGD పైప్ లైన్ నిర్మాణం పనులు పూర్తి చేస్తామని ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని,జనచైతన్య కాలనీ లో పూర్తి స్థాయిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని, విధి దీపాలను ఏర్పాటు చేస్తామని , పార్క్ లను అభివృద్ధి చేస్తామని, PAC చైర్మన్ గాంధీ గారు కాలనీ వాసులకు తెలియచేశారు.

కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

కాలనీ వాసులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని,ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానాని, ప్రతి కాలనీ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అగ్రగామి నియోజకవర్గం గా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM శ్రీహరి నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు జనచైతన్య కాలనీ వాసులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story