Kukatpally: కూకట్‌పల్లి చిత్తరమ్మ ఆలయంలో బోనాల సంబరాలు
Kukatpally: కూకట్‌పల్లి చిత్తరమ్మ బోనాల పండుగలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సమేతంగా పూజలు చేసి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Kukatpally: కూకట్‌పల్లి చిత్తరమ్మ ఆలయంలో బోనాల సంబరాలు
అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ...
కూకట్‌పల్లి, మారుతి సాగర్, రిపోర్టర్: కూకట్‌పల్లి చిత్తరమ్మ బోనాల పండుగ సందర్భంగా చిత్తరమ్మ దేవాలయంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బోనాల సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసిందన్నారు. మంచినీటి సదుపాయం, క్యూ లైన్లు, భక్తులకు పూజలు నిర్వహించేలా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అరికెపూడి గాంధీ అన్నారు.




