Padmarao Nagar: పద్మారావు నగర్‌లో డాక్టర్ కోట నీలిమ ప్రత్యేక పూజలు!
Padmarao Nagar: పద్మారావు నగర్‌లో గణేష్ మండపాలను సందర్శించిన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ప్రారంభం, ప్రజలకు శుభాకాంక్షలు.
Padmarao Nagar: పద్మారావు నగర్‌లో డాక్టర్ కోట నీలిమ ప్రత్యేక పూజలు!
పద్మారావు నగర్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మారావు నగర్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన వివిధ గణేష్ మండపాలను పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణ ముదిరాజ్ ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంతో పాటు నరేందర్ గౌడ్, ముడేల్ లవ ఆహ్వానం మేరకు న్యూ బోయిగూడ రైలు కళారంగ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలపై గణపతి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. వినాయక చవితి వేడుకలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి సందర్భంగా ప్రతి ప్రాంతంలో భక్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటూ గణనాథుని సేవలో తరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే గణేష్ ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి మరింత పెరగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పద్మారావు నగర్ డివిజన్ ప్రెసిడెంట్ జగదీశ్, సీనియర్ నాయకులు మల్లం రమేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వాహకులు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.




