Hyderabad: బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పల్లె ప్రశాంత్ నియామకం!

Hyderabad: హైదరాబాద్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

GANESH, JAMMIKUNTA
Published on: 15 July 2026 5:02 PM IST
Hyderabad
X

Hyderabad: బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పల్లె ప్రశాంత్ నియామకం!

హైదరాబాద్: హైదరాబాద్ లోని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యలయంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమీటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ అతార్ సింగ్ రావు, విశిష్ట అతిధిగా సెంట్రల్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అతార్ సింగ్ రావు రాష్ట్ర కమీటీ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పల్లె ప్రశాంత్ ని ప్రకటించారు.

ఈ సందర్భంగా అతార్ సింగ్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి బెహాన్ జీ మాయావతి ఆదేశాను సారం యువతకు పార్టీలో విస్తృత అవకాశాలు కల్పించాలని గుర్తుచేశారు. ఆ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న పల్లె ప్రశాంత్ ను ప్రత్యేకంగా అభినందించారు.

బీఎస్పీ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర కులాల్లోని పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంవత్సరాలు మాయావతి నాయకత్వం లో పనిచేస్తుందని గుర్తుచేశారు. ఓబీసీ వర్గాలను, యువకులను, విద్యావంతులను పార్టీకి జోడించబంలో పల్లె ప్రశాంత్ కృషి చేయాలని ఉపేదేశించారు. తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన పల్లె ప్రశాంత్ ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాం కృష్ణ, జోన్ చీఫ్ ఇంచార్జులు దాగిల్ల దయానందరావు, నిషాని రామచంద్రం, బోడపట్ల ఈశ్వర్ లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జోన్ ఇంచార్జులు, పార్లమెంట్ ఇంచార్జులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్, హాన్మకొండ జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రశాంత్ పలు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story