Hayathnagar: పెద్ద అంబర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పండుగుల రాజు
Hayathnagar: పెద్ద అంబర్‌పేట్ 52వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పండుగుల రాజు నియమితులయ్యారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం స్వీకరించారు.
Hayathnagar: పెద్ద అంబర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పండుగుల రాజు
హయత్ నగర్: కాంగ్రెస్ పార్టీ పెద్ద అంబర్‌పేట్ డివిజన్ 52వ డివిజన్ అధ్యక్షుడిగా పండుగుల రాజు నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా పండుగుల రాజు నియామక పత్రాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని పండుగుల రాజుకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, భాస్కర్ చారి, సిద్ధంకి కృష్ణారెడ్డి, గంట లక్ష్మారెడ్డి, ఇటుకల మహేందర్ రెడ్డి, గంట శ్రీనివాస్ రెడ్డి, మరిపల్లి గోవర్ధన్ గౌడ్, ఆర్కే నగర్ మల్లేష్, దాసరి నర్సింగ్ రావు, దేశారపు మధుసూదన్ గౌడ్, పండుగుల భాస్కర్, పండుగుల రమేష్, పాలడుగు నాగార్జున, ఎంజాల సంజీవ, ఎంజాల గిరీష్, బొర్రా శ్రీకాంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




